Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకులతో కొత్త రోగం.. కరోనా వైరస్ కంటే ప్రమాదకరం!

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (08:14 IST)
ఇప్పటికే కరోనా వైరస్ భయంతో ప్రజలు చచ్చి బతుకుతున్నారు. ఇపుడు కొత్తగా కాకులతో కొత్త వ్యాధి సోకుతుందట. దీనిపై కేంద్రం కూడా ఓ హెచ్చరిక చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంల కాకులతో కొత్తగా బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకుతోంది. ఇండోర్‌లో గత మూడు రోజులుగా పదుల సంఖ్యలో కాకులు చచ్చిపడుతుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఇండోర్ మున్సిపల్ అధికారులు, వెటర్నరీ విభాగం అధికారులు వాటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపారు. కాకుల మృతికి హెచ్5ఎన్8 ఎవియన్ ఇన్‌ప్లుయెంజా కారణమని అధికారులు చెబుతున్నారు. 
 
ఇది చాలా ప్రమాదకరమని, పక్షుల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇండోర్‌లోని డాలీ కాలేజీ క్యాంపస్‌లో ఇప్పటి వరకు వందకు పైగా కాకులు చనిపోయాయి. ఇండోర్‌లోని జూపార్క్ వైద్యుడు ఉత్తమ్ యాదవ్ మాట్లాడుతూ మృతి చెందిన కాకుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్టు తెలిపారు.
 
ఈ కొత్త వ్యాధిపై కేంద్రం హెచ్చరిక చేసింది. కరోనాతో పాటు మరో వైరస్‌తో ప్రమాదం పొంచి ఉందని కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకుల నుంచి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదం ఉందని అలర్ట్ చేసింది. 
 
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా కాకులు చనిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు చనిపోయిన కాకుల్ని టెస్ట్ చేయగా.. చనిపోయిన కాకుల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ను గుర్తించినట్లు రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుంజీ లాల్ మీనా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments