Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం.. కోళ్లు - బాతుల చంపేయాలంటూ ఆదేశం

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (10:47 IST)
కేరళ రాష్ట్రంలో మరోమారు బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. దీంతో తక్షణం బాతులు, కోళ్లను చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ పంజా విసిరింది. దీంతో 8 వేల పెంపుడు పక్షులైన బాతులను చంపేయాలని స్థాని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. అలాగే, కోళ్లు, మాంసం అమ్మకాలు, ఎగుమతులపై కూడా నిషేధం విధించింది. 
 
బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు క్లోరినేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా, కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో పంజా విసిరింది. ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
మరోవైపు, పోలీసులు, రెవెన్యూ, జంతు సంరక్షణ శాఖ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో రక్షణ చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్ళు, బాతులు, ఇతర మాంసం అమ్మకాల ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డీసీజెస్ ల్యాబ్‌కు పంపించారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసాన్ని ఆరగించడం వల్ల అది మనుషులకు సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments