Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అందాల పోటీల్లో గెలుపొందాలని టీచర్ భర్త ఏం చేశాడో తెలుసా?

ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పి సరైన మార్గంలో నడిపించాల్సిన గురువు స్థానంలో ఉన్నారు. కానీ, ఆ గురువే వక్రమార్గంలో నడిచాడు. తన భార్య అందాల పోటీల్లో గెలుపొందాలని

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (08:47 IST)
ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పి సరైన మార్గంలో నడిపించాల్సిన గురువు స్థానంలో ఉన్నారు. కానీ, ఆ గురువే వక్రమార్గంలో నడిచాడు. తన భార్య అందాల పోటీల్లో గెలుపొందాలని కలలుగన్నాడు. ఇందుకోసం తన వంతు సాయం చేయాలని భావించాడు. అంతే.. అందాల పోటీల్లో గ్రాండ్‌ శారీ కట్టుకుంటే తన భార్యను విజేతగా ప్రకటిస్తారని భావించాడు. ఇకేమాత్రం ఆలోచన చేయకుండా వస్త్ర దుకాణంలో ఖరీదైన చీరను దొంగిలించాడు. ఈ విషయాన్ని అందాలపోటీలను తిలకించేందుకు వచ్చిన ఓ వ్యక్తి షోరూమ్ యజమానికి సమాచారం అందించాడు. ఆ ఉపాధ్యాయుడు కటకటాలపాలయ్యాడు. తన భార్యపై అమితమైన ప్రేమతో చేసిన పని ఇప్పుడు అతని తలకు చుట్టుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఛత్తీ‌స్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌నకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఈయన భార్య ప్రమీలా గుప్తా. స్థానికంగా జరిగే మాన్సూల్ బ్యూటీ కాంపిటీషన్‌లో పాల్గొంది. అయితే, ఈ పోటీలో భార్య గెలవాలనే ఉద్దేశంతో శ్రీకాంత్ ఒక దుస్తుల షో రూంలోకి చొరబడి ఖరీదైన చీరను దొంగిలించాడు. ఈ చీర కట్టుకుని ప్రమీల కాంపిటీషన్‌లో పాల్గొంది. 
 
అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఈ చీరను గుర్తుపట్టి సదరు షోరూం యజమానికి సమాచారం అందించాడు. దీంతో ఆ యజమానితో పాటు పోలీసులు కాంపిటీషన్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. శ్రీకాంత్, ప్రమీలను విచారించేందుకు పోలీసులు బిలాస్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ వారిని ప్రశ్నించగా శ్రీకాంత్ నిజం ఒప్పుకున్నాడు. తాను అంత ఖరీదైన డిజైనర్ శారీని కొనలేనని, అందుకే చోరీ చేశానని తెలిపాడు. కాగా శ్రీకాంత్ ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments