Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌ మీద కల్వర్టు ప్రవాహాన్ని దాటబోతే ప్రాణాలే పోయాయి...(వీడియో)

Webdunia
బుధవారం, 23 జులై 2014 (09:08 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు మహా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బేతుల్ పట్టణం సమీపంలో చిన్న చప్టా రోడ్డు మీద నుంచి ప్రవహిస్తున్న వాగు రోడ్డుకు కోత వేసేసింది. రోడ్డు కొద్దిగానే మిగిలింది. అయితే ఒక యువకుడు ఆ రోడ్డు మీద నుంచి ప్రవాహం మధ్యలోంచి బైక్‌ని నడిపించాలని ప్రయత్నించాడు. 
 
తటపటాయిస్తూనే బైక్‌ని ముందుకు నడిపించాడు. అయితే అనుకోకుండా వాగును దాటడంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో ఆ యువకుడు బైక్‌తో సహా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రవాహం చాలా వేగంగా ఉందని, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు ఇక బతికే అవకాశం లేదని స్థానికులు అంటున్నారు. 
 
నిజానికి నీటి ప్రవాహం అంత లోతుగా ఉన్నట్లు కనబడకపోయేసరికి బైకుపై అవతలికి వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించని విధంగా ప్రవాహం మరింత వేగంగా రావడంతో బైకుతో సహా అతడు ప్రవాహంలోకి పడిపోయి కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే అతడు నీటి ప్రవాహంలో కలిసిపోయాడు.
 
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments