Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడుని జైలుకు పంపిన అత్తామామలు.. ప్రియుడుతో కుమార్తె రహస్య సహజీవనం...

బీహార్ రాష్ట్రంలో విచిత్ర కేసు ఒకటి వెలుగు చూసింది. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని అత్తామామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లుడు జైలుపాలయ్యాడు. అదేసమయంలో పుట్టింటి నుంచి మాయమైన కుమార్తె... త

Webdunia
గురువారం, 11 మే 2017 (08:56 IST)
బీహార్ రాష్ట్రంలో విచిత్ర కేసు ఒకటి వెలుగు చూసింది. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని అత్తామామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లుడు జైలుపాలయ్యాడు. అదేసమయంలో పుట్టింటి నుంచి మాయమైన కుమార్తె... తల్లిదండ్రులకు తెలియకుండా ప్రియుడితో రహస్యంగా సహజీవనం చేస్తూ వచ్చింది. చివరకు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తాము చేసిన తప్పును తెలుసుకుని నిర్ఘాంతపోయి, పోలీసులకు సమచారం అందించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన పింకీ అనే యువతికి 2015లో మనోజ్ శర్మ అనే యువకుడితో వివాహమైంది. పెళ్లి అయిన కొన్ని నెలలకే ఆశ్చర్యకరంగా పింకీ మాయమైంది. దీంతో తమ కూతురు పింకీని కట్నం కోసం అల్లుడే వేధించి చంపాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సారియా పోలీసులు కేసు నమోదు చేసి.. కొన్ని రోజుల తర్వాత కుళ్లిపోయి గుర్తుతెలియకుండా ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. దీన్ని పరిశీలించిన పింకీ తల్లిదండ్రులు.. ఆ మృతదేహం తమ కూతురే అని గుర్తించారు. 
 
దీంతో మనోజ్ శర్మను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. తమ కూతురు ప్రియుడితో కలిసి జబల్ పూర్ నగరంలోని కంటోన్మెంటు ప్రాంతంలో రహస్యంగా సహజీవనం కొనసాగిస్తుందని జైలులో ఉన్న మనోజ్ శర్మతోపాటు అతని తల్లిదండ్రులకు తెలిసింది. పెళ్లికి ముందే పింకీకి మయూర్ మలిక్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం సాగిందని, పెళ్లి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మనోజ్ శర్మతో జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందువల్లే భర్త నుంచి మాయమైన పింకీ తన ప్రియుడితో కలిసి సహజీవనం కొనసాగిస్తూ వచ్చిందని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments