Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీలానికి ఖరీదు కట్టారు... బీహారులో దారుణం...

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (22:26 IST)
మహిళ శీలానికి ఖరీదు కట్టే షరాబులు పెరిగిపోవడంతో బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఆటవిక రాజ్యమేలుతోంది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా గ్రామానికి చెందిన ఒక మహిళ పైన ప్రకాష్, రవిదాస్ అనే వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా వారి బారి నుంచి తప్పించుకుని పారిపోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఇంతకీ ఈ మహిళ చేసిన తప్పేమిటంటే.. పని కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన ఈమెపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆ గ్రామ పెద్దలు విచారించి.. ఆమె శీలానికి రూ.41 వేల వెల కట్టారు. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... బీహార్‌ రాష్ట్రం కటిహర్ జిల్లా కోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదా గ్రామంలో పని కోసం ఓ దళిత మహిళ పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. దీంతో ప్రకాశ్, నరేష్ రవిదాస్ అనే వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో పంచాయతీ పెద్దలు ఆమె శీలానికి 41 వేల రూపాయల ఖరీదు కట్టారు.
 
ఈ డబ్బులు తీసుకుని అత్యాచార ఘటనను మరచిపోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని పంచాయతీ పెద్దలు బాధితురాలిని ఆదేశించారు. దీంతో బాధితురాలు నిరసన వ్యక్తం చేయడంతో, నిందితుడు ఆమె భర్తకు నిప్పంటించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నరేష్ రవిదాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రకాశ్ పరారీలో ఉన్నాడు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments