Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. శోభనం రోజు రాత్రి విషం తాగేశారు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (09:18 IST)
వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో కష్టంగా తమ పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత వాళ్ల జీవితాంతం సంతోషంగా సాగిపోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అంతలో ఏమైందో ఏమోగానీ... శోభనం రోజు రాత్రే అనూహ్య ఘటన జరిగింది. వధూవరులిద్దరూ విషం తాగేశారు. విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్లిద్దరినీ బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 
బీహార్‌లోని సోనేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెంషెడ్‌పూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శాంతీదేవికి, గోపాల్‌గంజ్ నగరంలోని మిర్జ్‌గంజ్‌కు చెందిన ముకేష్ కుమార్ సింగ్ అనే 30 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ తమ బంధువులను ఒప్పించి గత శనివారం పెళ్లి చేసుకున్నారు. 
 
ఆదివారం ఆ దంపతులను ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి భోజన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఏమయిందో ఏమో కానీ సోమవారం తెల్లవారుజామున వారిని నిద్రలేపేందుకు వెళ్లిన బంధువులకు అపస్మారక స్థితిలో కనిపించారు. 
 
పక్కనే చికెన్ కూర కలిపిన అన్నం కూడా ఉంది. దాంట్లోనే విషం కలుపుకుని ఇద్దరూ ఆరగించివుంటారని భావిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ పెళ్లే అయినా ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. వాళ్లు కోలుకుంటేనే కానీ అసలేం జరిగిందన్నది తెలియదని బంధువులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments