Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లే టాయిలెట్లో వేసేసింది.. బిడ్డ కనిపించలేదని డ్రామా...

ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లే ఆ శిశువును చంపేసింది. ఆరు రోజుల పసికందును చంపి టాయ్‌లెట్ ట్యాంకులో పడేసింది. ఆపై ఏమీ తెలియనట్లుగా బిడ్డ కనిపించలేదంటూ డ్రామా చేసింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ దార

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (17:39 IST)
ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లే ఆ శిశువును చంపేసింది. ఆరు రోజుల పసికందును చంపి టాయ్‌లెట్ ట్యాంకులో పడేసింది. ఆపై ఏమీ తెలియనట్లుగా బిడ్డ కనిపించలేదంటూ డ్రామా చేసింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సమస్తిపూర్ జిల్లాకు చెందిన పింకీ దేవికి రెండో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. నాటి నుంచి చాలా ముభావంగా ఉన్న ఆమె, పుట్టి వారమైనా కానీ ఆ పసిపాపను హత్య చేసింది. 
 
ఇంట్లోని బంధువులు పాపకు పేరు పెట్టే కార్యక్రమ సందడిలో ఉండగా పింకీ దేవి ఈ దారుణానికి పాల్పడింది. పాప మృత దేహాన్ని టాయిలెట్ ష్లష్ ట్యాంకులో పడేసింది. పాప గురించి ఇంట్లో వారు అడగ్గా కనిపించడం లేదంటూ పింకీ దేవి హడావుడి చేసింది. ఎవరైనా ఎత్తుకెళ్ళారా లేక ఏదైనా జంతువు నోటకరచుకుని వెళ్ళిందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో బంధువులు ఊరంతా గాలించారు. 
 
అయితే పింకీ దేవి పలుసార్లు బాత్‌రూమ్‌కు వెళ్ళడాన్ని అత్త గమనించింది. అనుమానంతో లోపలికి వెళ్ళి చూడగా టాయిలెట్ ఫ్లష్ ట్యాంకు మూత సరిగా లేకపోవడాన్ని గమనించింది. దాన్ని తెరచి చూడగా అందులో పాప విగతజీవిగా కనిపించింది. దీంతో షాక్ అయిన అత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పింకీ దేవిని అరెస్ట్ చేశారు. అయితే పాపను తాను చంపలేదని చెప్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments