Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 అడుగుల గుంతలో ప్రాణాలతో ఉండగానే 19 ఏళ్ల యువతిని పూడ్చి పెట్టారు (Video)

తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ యువతిని మూడు అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టిన ఘటన ఒకటి బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్త

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (09:58 IST)
తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ యువతిని మూడు అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టిన ఘటన ఒకటి బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బీహాహ్ రాష్ట్రంలోని గోవిందపూర్ గ్రామంలో అమిత్ షా అనే వ్యాపారి ఉన్నాడు. ఈయన సంజన, అన్సారీ అనే దంపతుల స్థలాన్ని కబ్జా చేసి.. అక్కడ ఓ భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశాడు. ఈ భవన నిర్మాణానికి వారు అంగీకరించలేదు. దీనిపై గతంలో పలు మార్లు అమిత్ షా వారిని బెదిరించాడు. 
 
ఆ బెదిరింపులను వారు పట్టించుకోకపోవడంతో వారి ఇంటిపై దాడి చేసిన ఇద్దరు దుండగులు... వారిని హెచ్చరించేందుకు ఇంట్లో ఉన్న వారి కుమార్తె ఖుష్బూ (19)ను కొట్టి, బలవంతంగా లాక్కెళ్లి దగ్గర్లో ఉన్న 3 అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టారు.
 
తమ కుమార్తె కనిపించక పోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టుపక్కల గాలించారు. ఇంతలో అక్కడ కొత్తగా గుంత కనిపించడంతో దానిని తవ్వి చూడగా ఖుష్బూ స్పృహ కోల్పోయి కనపించింది. దీంతో గ్రామస్థుల సాతంతో ఆ యువతిని వెలికి తీశారు. 
 
షాక్‌‌కు గురైన ఖుష్బూ కోలుకోకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఖుష్బూను గుంతలోనుంచి తీస్తున్న వీడియోను వారు పోలీసులకు అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments