Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు : ముంబైకు వెళ్లిన బీహార్ వెళ్లిన ఐపీఎస్ బలవంత క్వారంటైన్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (11:43 IST)
బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు పలు రకాలైన మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ తాజాగా చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ముంబైకు వెళ్లిన బీహార్ ఐపీఎస్ అధికారిని నిర్బంధ హోం ఐసోలేషన్‌కు పంపించారు. 
 
సుశాంత్‌ను ఆయన ప్రియురాలు సినీ నటి రియా చక్రవర్తి మోసం చేసిందంటూ మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆదివారం పాట్నా నుంచి ప్ర‌త్యేకంగా ఐపీఎస్‌ విన‌య్ తివారీ ముంబైకి వ‌చ్చారు. కేసును కూలంకుషంగా విచారించేందుకు ఆయ‌న రంగంలోకి దిగారు. అయితే ముంబైకి చేరుకోగానే అక్క‌డి మున్సిప‌ల్ అధికారులు ఆఫీస‌ర్‌ను క్వారెంటైన్ చేశారు. 
 
బ‌ల‌వంతంగా ఆ ఆఫీస‌ర్‌ను క్వారెంటైన్ చేసిన‌ట్లు బీహార్ డీజీపీ గుప్తేశ్వ‌ర్ పాండే వెల్లడించారు. రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో బీఎంసీ అధికారులు విన‌య్ తివారీని క్వారెంటైన్ చేసిన‌ట్లు డీజీపీ పాండే ట్వీట్ చేశారు. ఐపీఎస్‌ మెస్‌లో అత‌నికి వ‌సతి ఇవ్వ‌లేద‌ని, గోరేగావ్‌లోని గెస్ట్‌హౌజ్‌లో అత‌ను స్టే చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దీంతో కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments