Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ సురక్షితం కాదు.. రష్యా నిర్ణయంతో గోవాకు దెబ్బ.. ఆదాయం డౌన్!?

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (10:56 IST)
రష్యా పర్యాటకులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునన్న జాబితా నుంచి భారత్‌ను తొలగించింది. రష్యన్ న్యూస్ ఏజన్సీ 'ఇంటర్ ఫాక్స్' కథనం ప్రకారం, భారత్‌తో పాటు ఈజిప్టు, టర్కీలకు రష్యన్ల ప్రయాణాలు అంత సురక్షితం కాదని పుతిన్ సర్కారు భావించడంతో.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, గోవా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రష్యా టూరిస్టులపై అధికంగా ఆధారపడివున్న నేపథ్యంలో రష్యా నిర్ణయంతో భారత్‌కు దెబ్బేనని తెలుస్తోంది. అలాగే క్యూబా, వియత్నాం, సదరన్ చైనా ప్రాంతాలు రష్యన్ల పర్యటనలకు అనుకూల ప్రాంతాల జాబితాలో చేరాయి. 
 
భారత్‌కు వచ్చే రష్యన్లలో 50 శాతానికి పైగా గోవాను సందర్శిస్తుంటారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది వరకూ రష్యన్లు గోవాకు వచ్చి వెళుతున్నట్టు తెలుస్తోంది. గోవాలోని రష్యన్ సమాచార శాఖ కార్యాలయం సైతం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురించి గోవాలో పర్యటిస్తున్న దేశ ప్రజలకు వెల్లడించింది. రష్యన్ పర్యాటకుల సంఖ్య తగ్గితే గోవా పర్యాటక ఆదాయం గణనీయంగా తగ్గుతుందని అంచనావేస్తున్నారు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments