Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగిన గుండె... ఈసీపీఆర్‌ ప్రయోగంతో మళ్లీ చలనం..

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (08:57 IST)
వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఏకంగా 90 నిమిషాల పాటు ఆగిపోయిన సైనికుడి గుండెలో తిరిగి చలనం మొదలయ్యేలా వైద్యులు చేశారు. ఈసీపీఆర్‌ ప్రయోగంతో ఇది సాధ్యమైంది. ఈ ప్రయోగాన్ని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు చేశారు. ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
24 ఏళ్ల జవాను శుభాకాంత్ సాహు గత నెల ఒకటో తేదీన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి గుండె పనిచేయడం మానేసింది. అతడిని బతికించేందుకు వైద్యులు 40 నిమిషాలపాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎక్స్‌ట్రా కార్పోరియల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) ప్రయోగించాలని వైద్యులు నిర్ణయించారు.
 
డాక్టర్ శ్రీకాంత్ బెహరా నేతృత్వంలోని వైద్య బృందం ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎకో)తో చికిత్స ప్రారంభించింది. దీంతో 90 నిమిషాల తర్వాత సాహు గుండెలో చలనం వచ్చి కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే లయ అసంబద్ధంగా ఉంది. ఆ తర్వాత క్రమంగా మెరుగుపడుతూ 30 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడింది. దీంతో 96 గంటల తర్వాత సాహుకు అమర్చిన ఎక్మోను తొలగించారు. ఈసీపీఆర్ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నదని, అయితే, గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు పనిచేస్తుందని వైద్య బృందం తెలిపింది. వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఘటన అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments