Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్స్‌ కోసమెచ్చిన నటిపై దర్శకుడి అత్యాచారం.. కోర్టులో కేసు కొట్టివేత.. ఎలా?

ఓ యవతి సినీ దర్శకుడిపై పెట్టిన అత్యాచార కేసును న్యాయస్థానం కొట్టివేసింది. సినీ ఛాన్సుల కోసం వచ్చిన ఆ యువతి ఇష్టపూర్వకంగానే దర్శకుడికి పడకసుఖం అందించిందని డిఫెన్స్ లాయర్ తన వాదనలతో నిరూపించాడు.

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (13:26 IST)
ఓ యవతి సినీ దర్శకుడిపై పెట్టిన అత్యాచార కేసును న్యాయస్థానం కొట్టివేసింది. సినీ ఛాన్సుల కోసం వచ్చిన ఆ యువతి ఇష్టపూర్వకంగానే దర్శకుడికి పడకసుఖం అందించిందని డిఫెన్స్ లాయర్ తన వాదనలతో నిరూపించాడు. అంటే తన క్లెయింట్ అయిన దర్శకుడు, బాధిత యువతి పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును కొట్టివేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
2009 జూలై 21న తన సినిమాలో 'ఐటెం గర్ల్' అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్‌ తన కార్యాలయానికి పిలిచారు. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు డ్యాన్స్‌ రిహార్సల్‌ పేరిట పిలిచి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆ అవకాశం మరో యువతికి ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ దర్శకుడి పేరు రాంకుమార్ కుమావత్. వయసు 51 యేళ్లు. ఈయన భోజ్‌పురి ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తానని పేర్కొంటూ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. 
 
కాగా, ఈ కేసు విచారణ ముంబై సెషన్స్ కోర్టులో సాగింది. ఈ కేసు విచారణ సందర్భంగా సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను ఆయన ఇంటికి వెళ్లానని, సినిమాలో తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదుచేసేదాన్ని కాదని డిఫెన్స్‌ లాయర్ క్రాస్‌ ఎగ్జామినేషన్‌‌లో ఆమె తెలిపింది. అంతేకాకుండా ఆమె శరీర భాగాలపై ఉన్న గాయాలు కూడా కల్పితమైనవేనని వైద్యనివేదికలో తేలింది. దీంతో వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని నిర్ధారించిన న్యాయస్థానం, ఆ కేసును కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం