Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. మోడీ స్వాగతం

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనబెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (15:48 IST)
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనబెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నెతన్యాహును మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సారా నెతన్యాహు కూడా ఉన్నారు.
 
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మన దేశానికి రావడం 15 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి. పదిహేనేళ్ళ క్రితం 2003లో ఆ దేశ ప్రధాని ఏరియల్ షరాన్ మన దేశానికి వచ్చారు. నెతన్యాహు ప్రయాణించిన విమానంపై భారతదేశం, ఇజ్రాయెల్ దేశాల జాతీయ పతాకాలు ఉన్నాయి. నెతన్యాహు మన దేశంలో 6 రోజులపాటు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరాటం, వ్యాపార సంబంధాల బలోపేతం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి.
 
ఈ సందర్భంగా తీన్‌ మూర్తి చౌక్‌ పేరును తీన్‌ మూర్తి హైఫీ చౌక్‌గా మార్చనున్నారు. నెతన్యాహు పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఆదివారం రాత్రి ఆయనకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. నెతన్యాహు వెంట ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11 యేళ్ల బాలుడు మోషే కూడా భారత్‌ వచ్చాడు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments