Bengaluru woman: సద్గురు ఏఐ డీప్‌ఫేక్ వీడియోను నమ్మి రూ.3.75 కోట్లు మోసపోయిన మహిళ

సెల్వి
శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (11:44 IST)
sadguru
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు పేరుతో రూపొందించిన ఒక ఏఐ డీప్‌ఫేక్ వీడియోను నమ్మి, బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 3.75 కోట్లు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశచూపిన సైబర్ నేరగాళ్లు, ఆమెను నిలువునా దోచుకున్నారు. ఈ వీడియో కేవలం 250 డాలర్ల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరితే అత్యధిక లాభాలు పొందవచ్చని సద్గురు చెబుతున్నట్లు ఉంది. 
 
డీప్‌ఫేక్ టెక్నాలజీ గురించి అవగాహన లేని ఆమె అది నిజమైన వీడియో అని నమ్మారు. వీడియో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయడంతో మోసం మొదలైంది. ఆ వెంటనే, వలీద్ బి అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. వారి మాటలు పూర్తిగా నమ్మిన వర్షా గుప్తా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పలు దఫాలుగా తన బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.3.75 కోట్లను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. 
 
మిరాక్స్ యాప్ ప్రతినిధిగా పరిచయం చేసుకుని విదేశీ ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్స్ ఉపయోగించి ఆమెతో మాట్లాడాడు. చివరికి మోసపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీని వెనుక పెద్ద సైబర్ క్రైమ్ ముఠా హస్తం ఉండొచ్చని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments