భారత్‌లో పర్యటిస్తున్న డచ్ యూట్యూబర్ పెడ్రో మోటాపై బెంగళూరు చిక్ పేటలోని చోర్ బజార్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పెడ్రో మోటా అనే యూట్యూబర్.. మార్కెట్లో తిరిగాడు. ఆ సమయంలో మోటా వద్దకు ఓ వ్యాపారి వచ్చాడు. మోటాను వెళ్లనీయకుండా దాడి చేశారు.
ఈ వీడియోను తన యూట్యూబ్‌లో పోస్టు చేసిన మోటా.. భారత్‌లో దాడికి గురయ్యానని రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన పోలీసులు నిందితుడు నవాబ్ హయత్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు.
విదేశీ పర్యాటకులను భయపెట్టడం, దాడులు చేయడం వంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తర్వాత మరో వీడియోను పోస్టు చేసిన మోటా.."దటీజ్ ఇండియా" అంటూ ప్రశంసలు కురిపించాడు. అందులో కొందరు వ్యక్తులు ఆయనకు గైడ్ చేస్తూ కనిపించారు.