Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికురాలి దుస్తులు విప్పించి.. ఫోటోలు తీసి.. వాట్సాప్‌లో షేర్.. ఎవరు?

క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. తాజాగా ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ ప్రయాణికురాలి దుస్తులను బలంవంతంగా విప్పించి.. ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియో తీసి... వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (09:22 IST)
క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. తాజాగా ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ ప్రయాణికురాలి దుస్తులను బలంవంతంగా విప్పించి.. ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియో తీసి... వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది.
 
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్ (26) విమానాశ్రయానికి వెళ్లేందుకు అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుని అందులో ఎక్కింది. ఈ క్యాబ్ డ్రైవర్ ఎయిర్‌పోర్టుకు అడ్డదారిలో వెళుతున్నానని ఆమెను నమ్మించి... విమానాశ్రయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి ఆమెను బంధించాడు.
 
ఆమె మొబైల్‌ను లాక్కున్నాడు. అరిచేందుకు ప్రయత్నిస్తే స్నేహితులను పిలిచి సామూహిక అత్యాచారానికి పాల్పడతామని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమెను బెదిరించి దుస్తులు విప్పించి ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం వాటిని వాట్సాప్‌లో షేర్ చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ విషయం ఎవరితోనూ చెప్పనని, తనను ఎయిర్‌పోర్టులో విడిచిపెట్టాలని బాధిత మహిళ అభ్యర్థించడంతో చివరికి ఆమెను విమానాశ్రయంలో వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు.
 
అనంతరం బాధిత మహిళ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం వేట ప్రారంభించారు. మూడంటే మూడు గంటల్లో డ్రైవర్‌ అరుణ్‌ను అరెస్ట్ చేశారు. ఓలా యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ధైర్యంగా తమకు ఫిర్యాదు చేసిన మహిళను అభినందిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి సీమంత్ కుమార్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments