Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

సెల్వి
బుధవారం, 13 ఆగస్టు 2025 (23:27 IST)
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం నెరపిన ఓ వ్యక్తి చివరికి హత్యకు గురైన ఘటన బెంగళూరులో జరిగింది. నమ్మిన స్నేహితుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ కలిసి తన ప్రాణాలు తీస్తారని ఊహించలేకపోయిన ఆ భర్త కథ విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్ (39), ధనుంజయ అలియాస్ జై చిన్ననాటి స్నేహితులు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసే విజయ్ కుమార్‌కు సుమారు పదేళ్ల క్రితం ఆశ అనే మహిళతో వివాహమైంది. వీరు కామాక్షిపాళ్యలో నివాసం ఉండేవారు.
 
అయితే, కొంతకాలంగా తన భార్య ఆశ, స్నేహితుడు ధనుంజయ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు విజయ్ కుమార్ గుర్తించాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా చూసినట్టు సమాచారం. ఈ విషయంపై భార్యను విజయ్ కుమార్ మందలించినట్లు తెలుస్తోంది.
 
అయినప్పటికీ ఆశ, ధనుంజయ తమ బంధాన్ని రహస్యంగా కొనసాగించినట్టు తెలుస్తోంది. ఇక అడ్డుగా వున్న విజయ్‌ని తొలగించుకోవాలనే ఈ క్రమంలో విజయ్ కుమార్‌ను ఆశ, ధనుంజయ ఇద్దరూ కలిసి కుట్ర పన్ని ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు.. విచారణ నిమిత్తం మృతుడి భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ధనుంజయ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments