బెంగుళూరు సెంట్రల్ డీసీపీ వినూత్నశైలి... జాతీయ గీతం ఆలాపనతో...

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (11:31 IST)
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయి. ఇందులోభాగంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటక రాష్ట్రంలో కూడా చెలరేగాయి. ముఖ్యంగా, సెంట్రల్ బెంగుళూరులో ఈ ఆందోళనలు ఉధృతంగా సాగాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
అదేసమయంలో నిరసనకారులను శాంతింపజేసేందుకు బెంగళూరు (సెంట్రల్) డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ వినూత్న శైలిలో వ్యవహరించారు. బెంగళూరు టౌన్ హాల్‌ వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగడంతో డీసీపీ వారిని శాంతిపజేసి వెనక్కిపంపే ప్రయత్నం చేశారు. అయితే తాము వెనక్కి వెళ్లేది లేదని నిరసనకారులు భీష్మించుకుకూర్చున్నారు. 
 
తనను నమ్మండని, ఆందోళన వద్దని, తనను విశ్వసించినట్లయితే తనతో కలిసి జాతీయ గీతం పాడమని వారిని డీసీపీ చేతన్ కోరారు. అనంతరం, ఆయన జాతీయ గీతాలాపన చేశారు. నిరసనకారులు కూడా ఆయనతో గొంతు కలిపారు. జాతీయగీతం పాడటం పూర్తికాగానే నిరసనకారులు శాంతించి అక్కడి నుంచి తమంత తాముగా వెనుదిరిగారు.
 
కాగా, గురువారం మంగళూరులో జరిగిన ప్రదర్శన హింసకు దారితీయడంతో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా పలువురిని బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. మంగళూరు సిటీ, దక్షిణ కన్నడ జిల్లాలో 48 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments