Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బైక్‌పై ప్రియుడి స్టంట్స్... ఊచలు లెక్కబెట్టిస్తున్న పోలీసులు!!

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (14:59 IST)
తన ప్రియురాలిని ఒళ్లో కూర్చోబెట్టుకుని బైకుపై ప్రియుడు స్టంట్స్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ప్రేమ జంటను అదుపులోకి తీసుకుని, ఆటకట్టించారు. ఇద్దరినీ అరెస్టు చేసి జైలు ఊచలు లెక్కబెట్టేలా చేశారు. అలాగే, స్టంట్స్ కోసం ఉపయోగించిన బైకును సైతం సీజ్ చేశారు. రోడ్లు ఉన్నది స్టంట్స్ చేసేందుకు కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది. 
 
ఈ నల 17వ తేదీ రాత్రి బెంగుళూరులోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టు మార్గంలో ఓ యువకుడు తన ప్రియురాలిని ఒళ్లో కూర్చోబెట్టుకుని బైక్ నడుపుతూ స్టంట్స్ చేశాడు. అతని వెనకాలో కారులో వస్తున్న ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త ఒక్కసారిగా వైరల్ అయింది. 
 
దీన్ని చూసిన నెటిజన్లంతా ఆ యువకుడి చర్యను తప్పుబట్టారు. పైగా, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బెంగుళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు బైక్ నంబరు ఆధారంగా యువకుడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు. 
 
థ్రిల్ కోరుకునే వ్యక్తులారా.. రోడ్డు ఉన్నది స్టంట్లు చేయడానికి కాదు. మీతోపాటు ప్రయాణించే ప్రతి ఒక్కరి కోసం రోడ్డును భద్రంగా ఉంచండి. అందరం బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతాం అని కామెంట్ పోస్ట్ చేశారు. బెంగుళూరు నగరం జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికే ఉందని, ఇది గందరగోళం సృష్టించాలనుకునే ప్రాంతం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments