Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన ఐదు రోజులకే భార్యను కడతేర్చాడు.. తలను నరికి అడవుల్లోనూ.. మొండాన్ని..?

పెళ్లి జరిగిన ఐదు రోజులకే నవ వధువు తనువు చాలించింది. నవ వధువును హత్య చేసింది.. జీవితాంతం తోడుంటానని ఏడడుగులు వేసిన భర్తే. అయితే కట్టుకున్న భార్యను భర్తే కడతేర్చినందుకు కారణం ఇంకా తెలియరాలేదు. వివరాల్ల

Webdunia
మంగళవారం, 16 మే 2017 (16:52 IST)
పెళ్లి జరిగిన ఐదు రోజులకే నవ వధువు తనువు చాలించింది. నవ వధువును హత్య చేసింది.. జీవితాంతం తోడుంటానని ఏడడుగులు వేసిన భర్తే. అయితే కట్టుకున్న భార్యను భర్తే కడతేర్చినందుకు కారణం ఇంకా తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. ప్రియాంక గౌరవ్ (24) వోర్లీలో నివసిస్తోంది.

ఈమె వేసుకున్న వినాయకుడి టాటూ ఆధారంగా ఆమె మృతదేహాన్ని నావి ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో పోలీసులు కనుగొన్నారు. ఐదు రోజుల పాటు తన బిడ్డ కనిపించలేదని పోలీసులకు ప్రియాంక గౌరవ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంకను ప్రాణాలతో కాపాడలేకపోయారు.
 
అయితే ప్రియాంక గౌరవ్‌ను హతమార్చింది భర్త సిద్ధేష్ గౌరవ్ అని పోలీసులు తెలిపారు. పెళ్లయిన ఐదు రోజులకే భార్యను హత్య చేసిన సిద్ధేష్ ఆరగడుగుల గొయ్యిలో పాతిపెట్టేందుకు ప్లాన్ వేశాడు. అనుకున్న విధంగానే భార్యను దారుణంగా హత్య చేశాడు. తలను నరికాడు. ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో తలను పెట్టి, దాన్ని బెడ్ షీట్‌తో కప్పాడు. ఆ ప్లాస్టిక్ బ్యాగ్‌ను తీసుకెళ్లి షాపూర్- నాసిక్ రోడ్డులో ఉన్న అడవుల్లో పడేశాడు. 
 
మొండాన్ని అతని ఇంటికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికికాలువలో పడేశాడు. ఈ హత్యకు వరుడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. తమ కూతురు కనిపించడం లేదని వధువు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆమె భర్తే నేరస్తుడని తేల్చారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హత్యకు గురైన ప్రియాంక బీకామ్ చదువుకుందని పోలీసులు చెప్పారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments