Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల పోటీల విజేతకు ఎన్నారై వరుడు బహుమతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:50 IST)
పంజాబ్ రాష్ట్రంలోని బతిండాలోని పలు ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లను చూసిన అనేక మంది అమ్మాయిలు, వారి తల్లితండ్రులు షాక్‌కు గురయ్యారు. బతిండాలో నిర్వహించే అందాల పోటీల్లో విజేతగా నిలిచేవారికి ఎన్నారై వరుడిని బహుమతిగా ఇస్తామని ఆ వాల్‌పోస్టర్లలో ప్రకటించారు. వీటిని చూసిన వారు నోరెళ్లబెట్టారు. దీంతో ఈ అందాలపోటీల నిర్వాహకులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచే అమ్మాయిలకు బహుమతిగా నగదు లేదా వజ్రవైఢూర్య కిరీటాలను బహుమతిగా అందజేస్తుంటారు. కానీ, ఇక్కడ ఎన్నారై వరుడిని ఇస్తామని ప్రటించడమే వింతగా ఉంది. 
 
ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో సైతం ఈ పోస్టర్లు సర్క్యూలేట్ చేశారు. తమ కుమార్తెలకు ఎన్నారై సంబంధాల కోసం చూస్తున్న తల్లిదండ్రులతో పాటు పలువురు వీటిపై ఆసక్తి వ్యక్తం చేశారు. 
 
కానీ, విషయం తెలిసిన పోలీసులు ఈ నెల 23వ తేదీన అందాల పోటీలను నిర్వహించాలని చూస్తున్న నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అందాల పోటీ విషయమై రూపొందించిన పోస్టర్లలో మహిళల గురించి అసభ్యకరమైన పదాలు రాసి ఉన్నట్టు గుర్తించామన్నారు. అందుకే కేసు నమోదు చేశామని వారు వివరించారు. 
 
అయితే, అందాల పోటీ ప్రకటన చూసి నెటిజన్లు షాకయ్యారు. ఇదేం బహుమతి అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, ఇందులో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద ఈ పోస్టర్లు బతిండాలో సంచలనం సృష్టించాయి.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments