Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో గ్యాంగ్ రేప్ : నోట్లో గుడ్డలు కుక్కి... చేతులు కట్టేసి కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

బెంగుళూరులో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ యువతిని.. ఆటో డ్రైవర్‌తో పాటు అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో దారి మళ్లించి... నోట్లో గుడ్డలుకుక్క

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:51 IST)
బెంగుళూరులో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ యువతిని.. ఆటో డ్రైవర్‌తో పాటు అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో దారి మళ్లించి... నోట్లో గుడ్డలుకుక్కి... చేతులు కట్టేసి అత్యాచారానికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగళూరుకు చెందిన ద్వితీయ పియుసి చదివే ఓ విద్యార్థిని ఏదో వ్యక్తిగత పనిమీద బెంగళూరు నుంచి రైలులో షిమోగాకకు వచ్చింది. ఆ తర్వాత సహ్యాద్రి కాలేజీకి వెళ్ళేందుకు ఆటో మాట్లాడుకుంది. ఆటో డ్రైవర్‌ షారూఖ్‌ కొద్దిదూరం వెళ్ళాక దారి మళ్ళించాడు. కొంతదూరం వెళ్లాక ఆటోలో మరో ఇద్దరు అతని స్నేహితులు ఎక్కించుకున్నాడు. 
 
వీరు ఆటో ఎక్కుతుంటే ఆ యువతి అభ్యంతరం చెప్పగా, దారిలో దిగేస్తారని బదులిచ్చారు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్ళాక విద్యార్థిని బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి చేతేలు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం ఆరుగురు ఈ సామూహిక అత్యాచారంలో పాల్గొన్నారని ఎస్పీ వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం