Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో ఐఎస్ఐఎస్ రిక్రూటర్ : బ్రిటన్‌ టీవీ ‘చానెల్‌ 4 న్యూస్‌’ కథనం!

Webdunia
శనివారం, 13 డిశెంబరు 2014 (12:20 IST)
ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్)కు కర్ణాటక రాజధాని బెంగళూరులో రిక్రూటర్‌ ఉన్నాడంటూ బ్రిటన్‌ టెలివిజన్‌ సంస్థ ‘చానెల్‌ 4 న్యూస్‌’ గురువారం ప్రసారం చేసిన కథనం దేశంలో సంచలనం రేపుతోంది. బెంగళూరు కేంద్రంగా ‘మెహిదీ మెహబూబ్‌ బిశ్వాస్‌’ అనే మారు పేరుతో ట్విట్టర్‌లో "@ShamiWitness' పేరిట ఖాతా ద్వారా ఆ వ్యక్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చానెల్‌ 4 పేర్కొంది. 
 
ఈ జిహాదీ ‘ఐటీ నగరం’లోగల ఓ పెద్ద భారత సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నట్లు ఆ టీవీ కథనం వెల్లడించింది. ఈ సమాచారంతో ఉలిక్కిపడిన బెంగళూరు పోలీసులు నగరాన్ని జల్లెపడుతున్నారు. ట్విట్టర్‌ ఖాతా వెనుకనున్న వ్యక్తి బెంగళూరు ఐటీ సిటీలోనివాడు కాకపోవచ్చునని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి. 
 
అయితే, ప్రస్తుతం మూతపడిన సదరు ఖాతా ఐఎస్‌ ప్రచార యుద్ధంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. కాగా, పాకిస్థాన్‌ పోలీసులు తొలిసారిగా అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ భారత విభాగం ‘అల్‌‌ఖైదా ఇండియా (ఏక్యూఐ) సభ్యులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు అగ్రశ్రేణి కమాండర్‌ కూడా ఉండటం గమనార్హం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments