Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ షాపు నుంచి ఇంటికొచ్చిన భర్త.. ప్రియుడి పక్కలో భార్య... కళ్లారా చూసి ఏం చేశాడంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనకుకాకుండా మరో వ్యక్తికి పడక సుఖం ఇస్తున్నపుడు కళ్లారా చూసిన ఆ భర్త కిరాతకుడిగా మారిపోయాడు. దీంతో తన భార్య తల నరికి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ద

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (13:44 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనకుకాకుండా మరో వ్యక్తికి పడక సుఖం ఇస్తున్నపుడు కళ్లారా చూసిన ఆ భర్త కిరాతకుడిగా మారిపోయాడు. దీంతో తన భార్య తల నరికి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అజ్జంపుర ప్రాంతానికి చెందిన సతీశ్ అనే అదేప్రాంతానికి చెందిన రూప (28) అనే మహిళను 9 యేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గతంలో డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చిన సతీశ్.. ఆ పనికి స్వస్తిపలికి తాము నివశించే ప్రాంతంలోనే చికిన్ షాపు తెరిచాడు. 
 
ఈ నేపథ్యంలో చికెన్ షాపుకు వచ్చి వెళ్లే సునీల్ అనే వ్యక్తితో రూపకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సతీశ్‌కు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించాడు. రూప ప్రవర్తనలో మార్పురాలేదు. చివరకు విషయం కుటుంబ సభ్యులకు తెలిసి పెద్దలు రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. 
 
ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం సతీశ్ ఎప్పటిలాగే చికెన్ షాపు తెరిచాడు. కొంతసేపటి తర్వాత ఏదో పనినిమిత్తం ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పడక గదిలో ప్రియుడి పక్కలో భార్య ఉండటాన్ని కళ్లారా చూసి తట్టుకోలేక పోయాడు. వెంటనే వంటింట్లో ఉన్న కొడవలితో సునీల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, అతను తప్పించుకుని పారిపోయాడు. 
 
దీంతో అతని కోపం నషాళానికెక్కింది. అంతే.. అదే కొడవలితో భార్య రూపపై విచక్షణారహితంగా దాడిచేశాడు. చివరికి ఆమె తలను మొండెం నుంచి వేరు చేశాడు. అనంతరం బైక్‌పై 20 కి.మీ వెళ్లి అజ్జంపుర పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments