Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ప్రియుడి కోసం బతికున్న కన్నవారినే చంపేసిన కూతురు...

కొంతమంది యువతీయువకుల తమ ప్రేమను సాధించుకునేందుకు ఎలాంటి దురాగతాలకైనా పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడి కోసం ఓ యువతి ఏకంగా బతికున్న కన్నవారినే చంపేసింది.

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (09:28 IST)
కొంతమంది యువతీయువకుల తమ ప్రేమను సాధించుకునేందుకు ఎలాంటి దురాగతాలకైనా పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడి కోసం ఓ యువతి ఏకంగా బతికున్న కన్నవారినే చంపేసింది. పైగా, పోలీసులకు చిక్కాక... కంటి ముందు కన్న తల్లిదండ్రులు నిలుచుని వున్నా.. వారు తన తల్లిదండ్రులు కాదంటూ పోలీసులకు చెప్పింది. న్నవారిని చూసిన ఆమె వీళ్లెవరో నాకు తెలియదనట్టుగా ప్రవర్తించటంతో వారు తల్లడిల్లారు. అమ్మానాన్న రోడ్డుప్రమాదంలో మరణించారని కూతురు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిందని తెలియగానే కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, సంతోష్‌నగర్‌ ఈదీబజార్‌కు చెందిన షోయబ్‌ (24) ఆర్కిటెక్చర్‌. ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో యువతులతో చాటింగ్‌ చేస్తుంటాడు. ఐదునెలల క్రితం ఫేస్‌ బుక్‌లో బెంగళూరులోని మార్బుల్‌ వ్యాపారికి చెందిన 17 యేళ్ల కుమార్తెతో స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ గంటల తరబడి ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తుండేవారు. సరదాగా షికారు చేసేందుకు హైదరాబాద్‌ రావాలంటూ కోరగానే ఆ యువతి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని భాగ్యనగరానికి వచ్చింది. 
 
అయితే, నగరానికి వచ్చిన ఆ యువతిని ఎక్కడ ఉంచాలో షోయబ్‌ తేల్చుకోలేకపోయాడు. భవానీనగర్‌లో ఉంటున్న స్నేహితుడు అజహర్‌(25) వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రెండు మూడు రోజులున్నారు. అక్కడి నుంచి సంతోష్‌నగర్‌ జ్యోగి బాగ్‌లో ఉంటున్న రషీద్‌ ఇంటికి బాలికను మార్చాడు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి బైక్‌పై నగరంలోని పలు ప్రాంతాల్లో షికార్లు చేశారు. 
 
ఈ క్రమంలో షోయబ్ స్నేహితులు ఆ యువతి వద్ద ఆరా తీయగా, తన తల్లిదండ్రులు మరణించారనీ, చిన్నమ్మ చిత్రహింసలు భరించలేక పారిపోయి వచ్చినట్టు నమ్మించింది. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించకపోవటంతో బెంగళూరు పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్టు ఆచూకీ కనుగొన్నారు.
 
ఈ క్రమంలో ఇక్బాల్‌ అనే వ్యక్తి సాయంతో మంగళవారం మానవ హక్కుల కమిషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. గతనెలలో తల్లిదండ్రు లిద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించారని, తన ఆస్తి కాజేసేందుకు చిన్నమ్మ చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్‌.. దర్యాప్తు చేయాలని సౌతజోన్‌ పోలీసులను ఆదేశించింది. అప్పటికే బెంగళూరు నుంచి బాలిక తల్లిదండ్రులు, పోలీసులు నగరానికి చేరుకుని జరిగిన విషయం చెప్పారు. 
 
అయితే, వారు తల్లిదండ్రులు కారంటూ పోలీసులను బాలిక నమ్మించే ప్రయత్నం చేసింది. తానే హైదరాబాద్‌ వచ్చానని, మిగిలిన వారికి ఎటువంటి ప్రమేయం లేదంటూ పోలీసుల ఎదుట చెప్పింది. కన్నకూతురి వాదన విన్న తల్లిదండ్రులు తీవ్రమనోవేదకు గురయ్యారు. మంగళవారం రాత్రి బాలికను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కేసులో నిందితులు షోయబ్‌, అజహర్‌, ఇక్బాల్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments