Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు బిస్కట్లు ఇచ్చి తల్లీకూతుళ్ళపై లైంగిక దాడి.. ఫోటోలు తీసి వికృతానందం.. నకిలీబాబా లీలలు!

తనను నమ్మి వచ్చిన భక్తురాళ్లను అక్కున చేర్చుకుని వారికి మత్తు బిస్కట్లు ఇచ్చేవాడు. అవి తిన్న తర్వాత మత్తులోకి జారుకునే వారిపై లైంగిక దాడికి దిగేవాడు. పిమ్మట నగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూస్తూ వికృతానంద

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (09:17 IST)
తనను నమ్మి వచ్చిన భక్తురాళ్లను అక్కున చేర్చుకుని వారికి మత్తు బిస్కట్లు ఇచ్చేవాడు. అవి తిన్న తర్వాత మత్తులోకి జారుకునే వారిపై లైంగిక దాడికి దిగేవాడు. పిమ్మట నగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూస్తూ వికృతానందం పొందుతూ వచ్చిన ఓ నకిలీ బాబా గుట్టు రట్టు అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జైపూర్‌లో రజనీశ్ గ్రోవర్ అలియాస్ అశోక్‌కుమార్ అనే బాబా ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలో సత్సంగ్‌లు నిర్వహిస్తూ వస్తున్నాడు. భక్తిమార్గం చూపుతానంటూ ప్రచారం చేయడంతో పలువురు భక్తులు నమ్మి ఆయన వద్దకు వచ్చేవారు. ఇలా తనను నమ్మి వచ్చిన భక్తురాళ్లకు మత్తు మందు కలిపిన బిస్కట్లు ఇచ్చి లైంగిక దాడి జరుపడమే కాకుండా ఫొటోలు తీసుకొని వికృతానందాన్ని పొందుతూ వచ్చాడు.
 
దీనిపై జైపూర్‌కు చెందిన ఓ 22 యేళ్ల మహిళ కేసు పెట్టింది. జైపూర్‌లో ఒక షాపు ప్రారంభించిన సదరు మహిళ ఆశీస్సులు ఇచ్చేందుకు బాబాను ఆహ్వానించింది. జైపూర్‌లో ఆమె ఇంటిలో బసచేసిన బాబా ప్రసాదం పేరిట మత్తుమందు కలిపిన బిస్కట్లు ఇచ్చి ఆ మహిళపై, ఆమె తల్లిపై లైంగికంగా దాడి జరిపాడు. అభ్యంతరకరమైన రీతిలో వారి ఫొటోలు కూడా తీశాడు. తేరుకొన్న తర్వాత ఇదేమిటి? అని నిలదీస్తే బెదిరింపులకు దిగాడు. 
 
గుట్టురట్టు చేస్తే మీ ఫొటోలు బయటపెడతానని తాఖీదులిచ్చాడట కూడా. దాంతో ఆ మహిళ బాబా స్మార్ట్‌ఫోన్‌ను ఎలాగోలా చేజిక్కించుకొన్నది. అందులో తమవి మాత్రమే కాకుండా ఇతర మహిళలకు సంబంధించిన అనేక ఫొటోలు ఉండటం చూసి ఖంగుతిని నేరుగా వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం