అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు..

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (12:02 IST)
అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటుగా మసీదుకు కూడా సుప్రీం కోర్టు స్థలం కేటాయించాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆలయ నిర్మాణం సహా ఇతర వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని, దాని బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. 
 
అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలంటూ పేర్కొన్న కోర్ట్, అయోధ్య పరిధిలోనే ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని స్వీకరించాలని కూడా సర్వోన్నత ధర్మాసనం సున్నీ వక్ఫ్‌బోర్డుకు సూచించింది.
 
ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మిర్జాపూర్, షంషుద్దీన్‌పూర్, చాంద్‌పూర్ 5 ప్రాంతాల్లో అనువైన స్థలాలను గుర్తించింది. ఇవన్నీ 15 కిలోమీటర్ల మేర పవిత్ర క్షేత్రంగా భావించే 'పంచ్‌కోసి పరిక్రమ' అవతలే ఉన్నాయి.
 
ఇదిలా ఉంటే సుప్రీం తీర్పుపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కాగా కొన్ని ముస్లిం వర్గాలు ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్ట్‌లో రివ్యూ పిటీషన్ వేసాయి. తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన 18 రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెలలో కొట్టేసింది. కాగా నాలుగు నెలల్లో రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments