Webdunia - Bharat's app for daily news and videos

Install App

భుజంపై మువ్వన్నెల పతాకం ఉంది.. ఈ ప్రయాణంలో ఒంటరిని కాదు.. శుభాంశు శుక్లా

ఠాగూర్
గురువారం, 26 జూన్ 2025 (13:39 IST)
యాక్సియం-4 మిషన్‌లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీలోకి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లాతో సహా మొత్తం నలుగురు వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన విషయం తెల్సిందే. ఈ బృందం గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ఎస్‌తో అనుసంధానం కానుంది. ఈ బృందం అక్కడ 14 రోజుల పాటు ఉండి పలు కీలక పరిశోధనలు చేపట్టనుంది. దాదాపు 41 సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయుడు అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  
 
ఈ నేపథ్యంలో అంతరిక్షం లైవ్‌కాల్‌లో శుభాంశు శుక్లా మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి అందరికీ నా నమస్కారాలు. తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఒక గొప్ప ప్రయాణం. 30 రోజుల క్వారంటైన్ తర్వాత ఇపుడు ఐఎస్ఎస్‌కు చేరబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తమతో పాటు జాయ్ అనే ఒక బేబీ హంస బొమ్మను కూడా తీసుకెళుతున్నామని, భారతీయ సంప్రదాయంలో హంస విజ్ఞానానికి ప్రతీక అని ఆయన వివరించారు. 
 
దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ లైవ్‌కాల్‌‍లో శుభాంశు శుక్లా తన అనుభూతులను వివరిస్తూ భారత రహిత స్థితికి ఇపుడిపుడో అలవాటు పడుతున్నారు. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా ఆహారం తీసుకోవాలి వంటి విషయాలను ఒక చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడ గడిపే ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై మన మువ్వన్నెల పతకాం ఉంది. అది చూసినపుడల్లా ఈ ప్రయాణంలో నేను ఒంటరిని కాదనని కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే ధైర్యం కలుగుతుంది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments