రైలు డ్రైవర్ సాహసం : కారం పడిన కళ్లతోనే...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:24 IST)
వాహనాన్ని నడిపే వ్యక్తి ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆ ప్రభావం ప్రయాణీకులందరిపై పడుతుంది. ప్రమాదం బారినపడే అవకాశమూ ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితులలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో రైలు డ్రైవర్ సాహసం చేశాడు. కళ్లలో కారంపడి బాధపడుతున్నా రైలుని నడిపి శభాష్ అనిపించుకున్నాడు. దాదాపు 18 కిమీ అలాగే రైలును నడిపాడు. 
 
ఇటీవల ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్ నుంచి టిట్వాలాకు లోకల్ ట్రైన్ బయలుదేరింది. రైలు కొద్ది దూరం ప్రయాణించి కాల్వా స్టేషన్ సమీపంలోకి రాగానే కొంత మంది పోకిరీలు డ్రైవర్ క్యాబిన్‌లోకి కారం విసిరారు. ఆ కారం కాస్త డ్రైవర్ లక్ష్మణ్ కళ్లలో పడింది. కానీ రైలు మధ్య మార్గంలో ఉండటంతో రైలును ఆపలేదు. కానీ కంట్రోల్ రూమ్‌కి వెంటనే సమాచారం అందించాడు. 
 
వేరే డ్రైవర్ రావడం కుదరదని వారు తేల్చి చెప్పడంతో సహసానికి దిగాడు. కారం పడిన కళ్లతోనే ఇబ్బంది పడుతూ దాదాపు 18 కిమీ ప్రయాణించి దివా స్టేషన్‌కు చేర్చాడు. రైల్వే అధికారులు అతడిని ప్రశంసించి వెయ్యి రూపాయలు నగదు బహుమతి అందించడంతోపాటు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, రైలు 95 కిమీ వేగంతో వెళుతున్నప్పుడు ఈ దాడి జరిగిందని, రైలు ఆపితే వెనుక రైళ్లకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని రైలు ఆపలేదని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments