Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య తీసుకెళ్లే రొయ్యలు, స్వీట్లంటే అటల్ జీకి చాలా ఇష్టమట..

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు.. నెల్లూరు నుంచి బీజేపీ సీనియర్ నేత, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీసుకెళ్లే రొయ్యలంటే లొట్టలేసుకుని తింటారట. ఇ

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (10:41 IST)
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు.. నెల్లూరు నుంచి బీజేపీ సీనియర్ నేత, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీసుకెళ్లే రొయ్యలంటే లొట్టలేసుకుని తింటారట. ఇంకా స్వీట్లు అంటే ఇష్టంగా తినేవారని సన్నిహితులు చెప్తున్నారు. ఆయన పరిపాలనా దక్షుడే కాదు.. మంచి భోజనప్రియుడని సన్నిహితులు అంటున్నారు. 
 
ప్రధానిగా ఉన్న సమయంలో అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా ఫుడ్ కౌంటర్ దగ్గరకు వెళ్లి స్వయంగా ఆర్డర్ ఇచ్చుకునేవారు. ఎక్కడికైనా వెళ్తే ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన వంటకాలను రుచి చూసేవారట. కోల్‌కతాలో పుచ్ కాస్, హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, లక్నో గలోటి కబాబ్స్ అంటే ఇష్టపడి మరీ తింటారట. 
 
అంతేగాకుండా ఛాట్ మసాలా దట్టించిన పకోడాలు, మసాలా టీ కాంబినేషన్ అంటే భలే ఇష్టపడేవారు. లక్నో నుంచి స్నేహితులు వస్తే కబాబ్స్ అది పనిగా తెప్పించుకునేవారట. నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా వాజ్ పేయి అమితంగా ఇష్టపడే రొయ్యలను నెల్లూరు నుంచి తీసుకువచ్చేవారు. కనీసం వారంలో రెండు రోజులైనా ఆయన మెనూలో రొయ్యలు ఉండేవట. 
 
అంతగా ఆయనకు రొయ్యలంటే ఇష్టం. ఇక కేంద్రమంత్రి విజయ్ గోయెల్ బెడ్నీ ఆలూ చాట్ తీసుకువస్తుండేవారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకున్నారు. ఫ్రాన్స్ పెప్పర్ సాల్ట్ అంటే అటల్ జీకి చాలా ఇష్టమని సన్నిహితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments