Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది.. సెల్ఫీ మృతుల్లో భారతీయులే..?

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (18:08 IST)
ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. సెల్ఫీ మరణాలు పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 2011 నుంచి నవంబర్, 2017 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 259గా ఉంది. 
 
సెల్ఫీ మృతుల్లో అత్యధిక శాతం భారత్‌లోనే వుండటం షాక్‌ ఇచ్చే విషయం. భారత్ తర్వాతి స్థానంలో రష్యా, అమెరికా, పాకిస్థాన్ లు ఉన్నాయి. సెల్ఫీల కారణంగా మరణించిన వారిలో అత్యధికులు (72 శాతం) పురుషులు, అందులోనూ 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు.
 
అలా సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో, ఇప్పటికే దేశంలో కొన్ని ప్రదేశాలను నో సెల్ఫీజోన్‌లుగా ప్రకటించారు. ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా స్మార్ట్ ఫోన్ యూజర్లు సెల్ఫీ పిచ్చి మాత్రం వీడడం లేదు. 
 
ఎత్తులో నుంచి కిందకు దూకి సెల్ఫీ కోసం ప్రయత్నించడం.. రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకోవడం వంటి సెల్ఫీ మృతులకు ప్రధాన కారణాలవుతున్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments