Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ పేరు నెగెటివ్.. పేరు మార్చుకుంటే యోగం తథ్యం.. పన్నీర్ తాత్కాలికమే : ఫేస్ రీడర్

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి యోగం లేదని ప్రముఖ హస్త సాముద్రికుడు, ఫేస్ రీడర్ ఎం.రమణరావు అన్నారు. ఎందుకంటే శశికళ అనే పేరులో నెగ

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (09:37 IST)
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి యోగం లేదని ప్రముఖ హస్త సాముద్రికుడు, ఫేస్ రీడర్ ఎం.రమణరావు అన్నారు. ఎందుకంటే శశికళ అనే పేరులో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని ఆ కారణంగా ఆమె ఇప్పట్లో ముఖ్యమంత్రి కాలేరన్నారు. అయితే, పేరు మార్చుకుని జయలలిత సెకండ్ అని పెట్టుకుంటే మాత్రం ఆమెకు రాజయోగం తథ్యమన్నారు. 
 
ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్న శశికళ గట్టెక్కుతారని, కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చినా ఇప్పటికిప్పుడు ఆమె అరెస్టు కాబోరన్నారు. ఇకపోతే పోయెస్‌ గార్డెన్‌‌లోని 'వేద నిలయం' వాస్తు కూడా నెగెటివ్‌ వైబ్రేషన్స్ పంపుతోందని, ఆ భవనం జయకు బాగున్నా, శశికళకు మాత్రం చేటు తెస్తుందన్నారు. అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వాస్తు కూడా సరిగా లేదని, అక్కడ కూడా నెగెటివ్‌ వైబ్రేషన్స్ వెలువడుతున్నాయన్నారు. 
 
అలాగే, పన్నీర్ సెల్వం విషయానికి వస్తే.. ఆయన ఎప్పటికీ తాత్కాలికమేనని అన్నారు. ఒ.పన్నీర్‌సెల్వం నక్షత్రాలను పరిశీలి స్తే ఆయన కూడా తాత్కాలికంగానే సీఎం పదవిలో కూర్చోగలరు. అందుకే ఇప్పటివరకూ ఆయన మూడుమార్లు సీఎం పీఠమెక్కి దిగాల్సి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కూడా ఆయన మళ్లీ సీఎం అయితే రెండుమూడు నెలల కంటే ఎక్కువ పని చేయలేరు. ప్రస్తుతం ఆయన సీఎం కావడం కూడా కష్టమేనని వివరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments