Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు మా రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీల్లేదు : అసదుద్దీన్ ఓవైసీకి కర్ణాటక పోలీసుల నోటీసు

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (10:02 IST)
మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌లో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్ర పోలీస్‌ అధికారులు నోటీస్‌ జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని మజ్లిస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం దారుల్‌సలాంలో అసదుద్దీన్ ఓవైసీకి కర్ణాటక విజయ్‌పూర్‌(బిజాపూర్‌) జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను పోలీసులు అందజేశారు. 
 
ఇదిలావుండగా, బిజాపూర్‌ సమీపం తకియా అఫ్జ్‌ల్‌పూర్‌లో మజ్లిస్‌ పార్టీ ఆధ్వర్యంలో జూన్ ఒకటో తేదీన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించవలిసి ఉంది. అయితే, శాంతి భద్రతల సమస్యల కారణంగా బీజా పూర్‌ ప్రాంతంలో 144(3) సెక్షన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ఏడురోజుల పాటు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు బిజాపూర్‌ జిల్లా కలెక్టర్‌ డి.రణదీప్‌ జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక పోలీసు అధికారులు అసదుద్దీన్ ఓవైసీకీ అందజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments