Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు నోటి క్యాన్సర్- శృంగారం కావాలన్నాడు.. భార్య నో చెప్పేసరికి చంపేశాడు..

భర్తకు నోటి క్యాన్సర్. ఈ ప్రాణాంతక మౌత్ క్యాన్సర్ దవడకు రంధ్రం పడేంతగా ముదిరింది. అయితే భార్యతో అతడు శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ ఆమె ససేమిరా అంది. అంతే భర్త కోపంతో ఊగిపోయాడు. కత్తితో

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (10:59 IST)
భర్తకు నోటి క్యాన్సర్. ఈ ప్రాణాంతక మౌత్ క్యాన్సర్ దవడకు రంధ్రం పడేంతగా ముదిరింది. అయితే భార్యతో అతడు శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ ఆమె ససేమిరా అంది. అంతే భర్త కోపంతో ఊగిపోయాడు. కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అజయ్ (40), అతని భార్య మమతలకు 17 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. 
 
వీళ్లిద్దరూ యూపీలోని లలిత్ పూర్ జిల్లాలో నివాసమున్నారు. కానీ క్షురకుడైన అజయ్‌కు ఏడాది క్రితం నోటి కేన్సర్‌ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పట్నుంచి అజయ్‌ ఇంట్లోనే ఉండిపోయాడు. దీంతో ఆయన భార్య మమత ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకుని నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 11న భార్య వద్దకు వెళ్లిన అజయ్‌.. శృంగారంలో పాల్గొనాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. 
 
ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. మమత సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, అజయ్-మమత దంపతులకు 16 ఏళ్ల అమ్మాయి, ఎనిమిదేళ్ల కుమారుడు వున్నారు. 
 
భర్త అజయ్‌కు మెరుగైన చికిత్స అందించడం కోసం సోదరితో కలిసి అన్నీ ఏర్పాట్లు చేశామని, ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్చేందుకు అన్నీ సిద్ధం చేశామని.. మమతకు ఉద్యోగం కూడా దొరికిందని మమత సోదరుడు పోలీసులకు తెలిపాడు. కానీ ఇంతలో భర్త చేతిలో మమత హతమైందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం