Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీ

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (14:49 IST)
ఈ జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు జరుగుతూనే ఉంటాయని వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ వ్యాఖ్యానించారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. 
 
ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీపక్ హల్దార్‌పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలువురు తృణమూల్ నేతలు కూడా ఇదే విధంగా వ్యాఖ్యానికి చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే. 
 
గతంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ తపస్ పాల్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చిక్కుల్లో పడ్డారు. ఈయనగారు.. సీపీఎం కార్యకర్తలు, నేతలు తమ పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నట్టయితే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో మీ (సీపీఎం) మహిళలను అత్యాచారం చేయిస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments