Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రూయిజ్ డ్రగ్స్ కేసు : ఎన్సీపీ విచారణకు వచ్చిన ఆర్యన్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (14:48 IST)
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయి ఇటీవల బెయిలుపై విడుదలైన బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ వద్ద నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం మరోమారు విచారణ జరిపింది. ఇందుకోసం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఎదుట హాజరయ్యారు. 
 
ఇటీవల ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, ప్రతి శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరవ్వాలన్న షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆర్యన్‌ ఖాన్‌ ఎన్సీబీ ఎదుట హాజరయ్యాడు. 
 
రేవ్‌ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక నౌకపై ఎన్సీబీ అధికారులు అక్టోబరు నెల 2వ తేదీన రెయిడ్ చేశారు. అక్కడ ఆర్యన్‌తోపాటు అతని స్నేహితుడు అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ ధమేచా సహా పలువురు ప్రముఖులు కూడా దొరికిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ బెయిల్ లభ్యమైంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments