Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయం హవా... సిక్కింలో ఎస్కేఎం ముందంజ

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (13:21 IST)
అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా, అరుణాచల్‌లో భారతీయ జనతా పార్టీలు అధికారం దిశగా దూసుకెళుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సిక్కింలో 32 స్థానాలకుగానూ 30 సీట్లలో ఎస్‌కేఎం ముందంజలో ఉంది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. 
 
ప్రతిపక్ష 'సిక్కిం డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌' కేవలం ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరుస్తుండడం గమనార్హం. ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ ముందంజలో కొనసాగుతున్నారు. మాజీ సీఎం ఎస్‌డీఎఫ్‌ అధినేత పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ వెనకంజలో ఉన్నారు. ఎస్‌డీఎఫ్‌ తరఫున బరిలో ఉన్న భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బైచుంగ్ భూటియా సైతం వెనకబడడం గమనార్హం. భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీ రామ్‌ థాపా వెనకంజలో కొనసాగుతున్నారు.
 
అలాగే, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. 60 సీట్లున్న ఈ రాష్ట్రంలో భాజపా 33 స్థానాల్లో ముందంజలో ఉంది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఆరు, ఎన్సీపీ నాలుగు, పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్‌ ఒక స్థానంలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఒక స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే విజయం సాధించగా.. మరో అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments