Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కింది వీటిలోనే ... అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (13:11 IST)
అయోధ్య రామాలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని కర్నాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామ భక్తులు అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే, ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని, ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు. అరుణ్ యోగిరాజ్ కుటుంబం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొడుకు రూపుదిద్దిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించడంతో తమ కుటుంబానికి దక్కిన మహాద్భాగ్యంగా భావిస్తున్నట్టు అరుణ్ యోగిరాజ్ తల్లి పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో బాల రాముడి విగ్రహానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు. బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెండి సుత్తి, బంగారు ఉలిని చేతిలో పట్టుకుని చూపిస్తూ, వీటితోనే బాల రాముడి దివ్యక్షేత్ర నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు. ఈ ఫోటోను అరుణ్ యోగిరాజ్ తన  ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్ కావడం మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments