Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాహిర్ అరెస్ట్... ఇంతకీ తాహిర్ ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:35 IST)
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సెక్యూరిటీ అసిస్టెంట్ అంకి్ శర్మ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత తాహిర్ హుస్సేన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో అంకిత్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాహిర్‌పై ఆరోపణలు రావడంతో ఆయనను ఆప్ సస్పెండ్ చేసింది. ఈ కేసులో తాహిర్ లొంగిపోయేందుకు ప్రయత్నించగా, కోర్టు ఆయన దరఖాస్తును తిరస్కరించింది.

దీంతో గురువారం ఆయనను ఢిల్లీ పోలీసు శాఖ క్రైమ్ బ్రాంచ్ ఇంటర్ స్టేట్ సెల్ అరెస్ట్ చేసింది. ముందస్తు బెయిలు కోసం తాహిర్ పెట్టుకున్న దరఖాస్తుపై ఢిల్లీ కోర్టు మంగళవారం విచారణ జరిపింది.

అంకిత్ శర్మ తండ్రి ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంకిత్‌ను కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు తాహిర్‌పై ఆరోపణలు నమోదు చేశారు.

తాహిర్ హుస్సేన్ తన పొరుగు ఇళ్ళపై పెట్రోలు బాంబులు విసిరినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. గత వారం ఢిల్లీలో అల్లర్లు జరిగిన సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో తాహిర్ మాట్లాడినట్లు బీజేపీ నేత ఒకరు ఆరోపించారు.

తాహిర్ నివాసంలో జరిపిన సోదాల్లో రాళ్ళు, ఇటుకలు, పెట్రోలు బాంబులు దొరికినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ తాను అమాయకుడినని తాహిర్ వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments