Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (17:29 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సంస్థకు చెందిన అగ్ర నేతతో పాటు ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో భారత సైన్యం ఈ ఆపరేషన్‌ చేపట్టి పైచేయి సాధించింది. ఈ నెల 5వ తేదీన కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీనికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాదుల మృతదేహాలను గుర్తించాల్సివుంది. పరిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు నుంచి ఆర్మీ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన తీవ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపాయి. ప్రతిగా సైన్యం కూడా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఒక జవాను గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments