Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ దొంగతనం: ముతూట్ ఫైనాన్స్ నుంచి రూ. 7 కోట్ల విలువ చేసే బంగారం చోరీ

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (17:45 IST)
తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్​-బగలూరు రోడ్డు వద్ద ఉన్న ముతూట్​ ఫైనాన్స్​ బ్రాంచ్​లోకి చొరబడ్డ దుండగులు.. పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది.
 
రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం బ్రాంచ్​ను తెరిచారు సిబ్బంది. కాసేపటికే కస్టమర్ల రూపంలో లోపలికి ప్రవేశించారు దుండగులు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా.. వారిని గన్​తో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్​ తాళం తీసుకుని.. సుమారు 25కేజీలకు పైగా బంగారాన్ని, రూ. 90 వేల నగదును ఎత్తుకెళ్లారు. 
 
ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక అసలు విషయం బయటపడింది. కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల విలువే రూ. 7 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments