Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో 'కింగ్ కాంగ్' కోసం పరితపించిన అమ్మ.. కంటికి రెప్పలా చూసుకున్న నర్సులు!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘ కాలం పాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. అయితే, ఆమె ఆస్పత్రిలో ఉన్న 74 రోజుల పాటు.. ఆమెను కింగ్ కాంగ్ మాత్రం కంటికి రెప్పలా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (17:04 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘ కాలం పాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. అయితే, ఆమె ఆస్పత్రిలో ఉన్న 74 రోజుల పాటు.. ఆమెను కింగ్ కాంగ్ మాత్రం కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇంతకీ కింగ్ కాంగ్ అంటే ఏంటనే కదా మీ సందేహం. కింగ్ కాంగ్ అంటే.. ముగ్గురు నర్సులను జయలలిత ముద్దుగా పెట్టిన పేరు. ఆ ముగ్గురు నర్సుల పేర్లు షీలా. రేణుక. చాముండేశ్వరి. 
 
జయలలిత ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పుడు తరచూ ఈ ముగ్గురు నర్సుల కోసమే అమ్మ కళ్లు ఆత్రుతగా ఎదురుచూసేవని అపోలో ఆస్పత్రి వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. జయలలితకు వైద్య సేవలు అందించేందుకు మూడు షిఫ్టుల్లో 16 మంది నర్సుల బృందం పని చేసింది. 
 
వీరిలో కింగ్ కాంగ్ అంటే జయలలిత చాలా ఇష్టపడేవారట. చాలాసార్లు ఆమె తమతో మాట్లాడుతూ... 'ఏం చేయాలో చెప్పండి... మీరు చెప్పినట్టే చేస్తాను' అని అడిగినట్టు నర్సుల్లో ఒకరైన సీవీ షీల బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. 'లోపలికి వెళ్లగానే ఆమె మమ్మల్ని చూసి నవ్వేవారు. ఆప్యాయంగా మాట్లాడేవారు. చికిత్స కోసం ఎంతో ఓపికగా సహకరించారు. మేము చుట్టూ నిలుచుంటే ఎంత కష్టమైనా పెట్టింది తినేవారు. ఆమె కోసం మా అందరి వద్ద తలా ఓ స్పూన్ ఉంటే.. ఆమె వద్ద మరో స్పూన్ ఉండేది' అని షీలా చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే.. ఆస్పత్రిలో చేరిన మొదట్లో జయ చాలా ఉత్సాహంగా ఉండేవారు. నర్సులు, వైద్యులతో చలాకీగా మాట్లాడేవారు. అప్పుడప్పుడు జోకులు కూడా వేసేవారు. జయకు అపోలో ఆస్పత్రిలోని కాఫీ అస్సలు నచ్చేది కాదు. ఇదే విషయాన్ని ఓసారి తనకు సేవలందించే నర్సలు బృందంతో చెబుతూ 'మీ అందరూ కలిసి పోయెస్ గార్డెన్‌లోని మా ఇంటికి రండి. కొడైనాడు నుంచి తెప్పించి మంచి టీ ఇస్తా' అన్నారట. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments