Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఏపీ జవాన్ మృతి

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (11:27 IST)
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో జమ్మూలో సైనికుడిగా పనిచేస్తున్న తంతటి కిరణ్ కుమార్ (41) బ్రెయిన్ స్ట్రోక్‌తో సోమవారం మృతి చెందాడు. తుని మండలం హంసవరం గ్రామం ఆయన స్వస్థలం. కిరణ్‌కుమార్‌ మృతి వార్త తెలియగానే ఆయన భార్య విజయకుమారి, సోదరుడు రవికుమార్‌ జమ్ముకు చేరుకున్నారు.
 
శ్రీనగర్ విమానాశ్రయంలో కిరణ్ కుమార్ మృతదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు వారికి అప్పగించారు. భర్త మృతదేహాన్ని చూసి విజయకుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాత్రికి విశాఖపట్నం చేరుకుని ఉదయం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్ మృతదేహానికి బుధవారం ఉదయం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
కిరణ్ కుమార్‌కు భార్యతో పాటు కుమారుడు జతిన్ (12), కుమార్తె మెర్సీ (10), తల్లిదండ్రులు జాన్, భాగ్యవతి ఉన్నారు. ఇద్దరు కొడుకులు దేశసేవలో ఉన్నారు హంసవరం గ్రామానికి చెందిన జాన్, భాగ్యవతి దంపతులకు ముగ్గురు కుమారులు. 
 
మొదటి కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా, రెండో కుమారుడు కిరణ్ కుమార్ 2005లో సీఆర్పీఎఫ్‌లో చేరగా.. మూడో కుమారుడు రవికుమార్ ఆర్మీలో చేరాడు. తమ ఇద్దరు కుమారులు దేశ రక్షణలో సేవలందించడం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించిందని, కిరణ్‌కుమార్‌ మృతి తమను విషాదంలో ముంచెత్తిందని తల్లిదండ్రులు విలపించారు. 
 
కిరణ్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ రాయి మేరీ అవినాష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments