Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత: విద్యార్ధులను అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (08:26 IST)
ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో గురువారం రాత్రి మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ వీసీని తొలగించాలంటూ విద్యార్ధులు రాష్ట్రపతి భవన్‌ వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రిభవన్‌ వద్ద పోలీసులు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
 
కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు వైస్ ఛాన్సలర్ ఎం.జగదీశ్ కుమార్ ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఐదుగురు ప్రొఫెసర్లు సుశాంత్ మిశ్రా, మజహర్ ఆసిఫ్, సుధీర్ ప్రతాప్ సింగ్, సంతోష్ శుక్లా, భస్వతీ దాస్ సభ్యులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి జేఎన్‌యూ రిజిస్ట్రార్ డా. ప్రమోద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
జనవరి 5 ఆదివారం సాయంత్రం జేఎన్‌యూలోకి ముసుగులతో ప్రవేశించిన సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో విద్యార్ధులు, అధ్యాపకులపై దాడికి పాల్పడి పాల్పడ్డారు. ఈ ఘటనలో విద్యార్ధి సంఘం నేత అయిషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments