Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోరోజు 40వేల పైనే కరోనా కొత్త కేసులు

Webdunia
గురువారం, 29 జులై 2021 (10:18 IST)
దేశంలో రెండోరోజు కరోనా కేసులు 40వేలకు పైనే వెలుగుచూశాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ కూడా 600పైనే మరణాలు సంభవించాయి. అలాగే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
తాజాగా 17,28,795 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,509 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.15కోట్ల మార్కును దాటాయి. కేరళలో 22వేల కేసులు, మహారాష్ట్రలో 6,857 కేసులు బయటపడ్డాయి. దేశంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో ఈ రెండు రాష్ట్రాలదే సగానికిపైగా వాటా ఉంటోంది.
 
కొవిడ్ ధాటికి నిన్న మరో 640మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.22లక్షలకు చేరింది.
 
నిన్న 38,465 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తంమీద 3.07కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.38 శాతంగా ఉంది.
 
ప్రస్తుతం 4,03,840 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోసారి క్రియాశీల కేసులు నాలుగులక్షలకు ఎగువన నమోదయ్యాయి. క్రియాశీల రేటు 1.28 శాతానికి చేరింది.
 
నిన్న 43,92,697 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన టీకాల సంఖ్య 45కోట్ల మార్కు దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments