Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాహజారే థర్డ్ ఫైట్... 1100 కి.మీ పాదయాత్రం.. ఎందుకు? ఎప్పుడు?

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (08:09 IST)
సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే మూడో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. భూసేకరణ చట్ట సవరణలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ పోరాటానికి కత్తులు నూరుతున్నారు. వార్దా నుంచి ఢిల్లీకి ఏకంగా 1100 కి.మీ పాద యాత్ర చేసే సాహసానికి పూనుకుంటున్నారు. ఎలాగైనా సరే ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలపై సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సమరశంఖం పూరించారు. ఈ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మహారాష్ట్రలోని వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీనివలన దారిలోని అన్ని గ్రామాలను పట్టణాలను కలుపుకుంటే భూసేకరణ చట్టంపై ఒక అవగాహన వస్తుందనేది వారి భావన.
 
వార్ధాలోని గాంధీ ఆశ్రమం నుంచి మొదలయ్యే యాత్ర ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందన్నారు. ఈ యాత్రకు సుమారు 3 నెలల సమయం పడుతుందన్నారు. ఈ నెల 9న సేవాగ్రామ్‌లో జరిగే సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను నిర్ణయిస్తామని చెప్పారు. మూడు నెలల పాదయాత్రతో దేశంలో ఇదే ప్రధాన చర్చనీయాంశం కానున్నది. 
 
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments