Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజనా మిశ్రా కేసు.. 22 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (18:59 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ, దిశ చట్టాలెన్ని వచ్చినా కామాంధుల తీరు మారట్లేదు. తాజా ఒడిశాలో సంచలనం సృష్టించిన అంజనా మిశ్రా సామూహిక లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడు బీబన్ బిశ్వాల్‌ని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికదాడి ఘటన జరిగిన 22 ఏళ్ల తర్వాత అతన్ని పట్టుకున్నట్లు ట్విన్ సిటీ పోలీసు కమిషన్ సుధాన్షు సారంగి వెల్లడించారు. 
 
1999లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మాజీ భార్య అంజనా మిశ్రాను ఆ ఏడాది జనవరి 9వ తేదీన అంజనా మిశ్రా.. సామూహిక లైంగికదాడి గురైంది. తన ఫ్రెండ్‌తో కలిసి వాహనంలో వెళ్తున్న ఆమెపై భువనేశ్వర్ శివారు ప్రాంతమైన బారంగ్‌లో స్నేహితుడి ముందే ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 
 
ఈ కేసులో పదియా సాహూ, దీరేంద్ర మోహంతిలను ఆ ఏడాదే పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐ విచారించింది. 2002లో ఈ కేసును అంజనా గెలిచింది. నిందితులకు జీవితకాల శిక్షతో పాటు 5వేల జరిమానా విధించారు. ఆ నాటి నుంచి బీబన్ బిశ్వాల్ పరారీలో ఉన్నారు.
 
అతన్ని పట్టుకునేందుకు ఒడిశా పోలీసులు 'సైలెంట్ వైపర్' అన్న పేరుతో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పేరు మార్చుకున్న బీబన్‌.. మహారాష్ట్రలో ఓ ప్లంబర్‌గా పనిచేశాడు. ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతన్ని నేడు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments