Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ 'దేవత' అవుతుందా? జయ సమాధి వద్ద తలనీలాలు, పెండ్లిళ్లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన దేవుడు అంటూ ఆయన ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకుని పూజలు చేశారు. ఇటీవలే కన్నుమూసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా అక్కడి ప్రజలు దేవతను చేసేస్తున్నట్లు కనిపిస్తోంది. మెరీనా తీరం వద్ద ఆమె సమాధి వద్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (12:06 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన దేవుడు అంటూ ఆయన ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకుని పూజలు చేశారు. ఇటీవలే కన్నుమూసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా అక్కడి ప్రజలు దేవతను చేసేస్తున్నట్లు కనిపిస్తోంది. మెరీనా తీరం వద్ద ఆమె సమాధి వద్ద జయ అభిమానులు తలనీలాలు సమర్పిస్తున్నారు. ఈ తంతు గత వారం నుంచి అలా సాగుతూనే ఉంది. తాజాగా జయను ఆరాధిస్తున్నవారు మరో అడుగు ముందుకు వేశారు. 
 
అదేమిటంటే... ఆమెను దేవతగా కొలుస్తూ ఆమె సమాధి వద్ద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్నాడీఎంకె యువజన విభాగం నాయకుడు ఫ్రాన్సిస్, రెజీలా ప్రీతిలు వచ్చే ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకోవాల్సి ఉండగా, శుభలేకను జయకు ఇచ్చారట. అప్పట్లో జయ తన పెళ్లికి తప్పక వస్తానని చెప్పారట. కానీ విధి వక్రీకరించి ఆమె తనువు చాలించడంతో ఫ్రాన్సిస్ దుఃఖంలో మునిగిపోయాడు. 
 
తన పెళ్లికి అమ్మ రాదని తెలిసి ఆవేదన చెందిన ఫ్రాన్సిస్ తన పెళ్లిని జయ సమాధి వద్ద చేసుకోవాలని నిశ్చయించాడు. అనుకున్నదే తడవుగా పెళ్లి కుమార్తె బంధువులు, వరుడు బంధువులంతా జయ సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడే వీరిద్దరూ దండలు మార్చుకుని పెళ్లి చేసేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

పృథ్వీరాజ్‌ లైలా ప్రమోషన్ లో డైలాగ్స్ అన్నాడా, అనిపించారా?

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments