Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నఅమితాబ్.. త్వరలో డిశ్చార్జి

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (06:42 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా టెస్టుల్లో ఆయనకు కోవిడ్ నెగెటివ్ వచ్చింది. అమితాబ్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

తొలుత కరోనా పాజిటివ్ అని తేలడంతో అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఐశ్వర్యకు కూడా కరోనా అని నిర్దారణ అయింది. అయితే ఆమె హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు మరింత పెరగడంతో ఆమె కూడా ఆసుపత్రిలో చేరారు.
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. కరోనా గురించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ధైర్యం చెప్పారు. తాము కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
 
మరోవైపు అమితాబ్ ఆరోగ్యం గురించి నానావతి ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ... ఆయన టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ గా ఉన్నాయని తెలిపారు. బ్లడ్, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments